నారాయణ పేట జిల్లా మాగనూర్ మండల కేంద్రంలో రైతులు నిరసన బాట పట్టారు. వరి కొనుగోలు చేసేటప్పుడు ధాన్యం నింపేందుకు అధికారులు గోనె సంచులు ఇవ్వడం లేదంటూ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వారం పదిరోజులుగా గోదాముల వద్దే పడిగాపులు కాస్తున్నా పట్టించుకోకుండా... మధ్యలో వచ్చిన దళారులకే గోనె సంచులు అందిస్తున్నారని వాపోయారు.
రవాణా వ్యవస్థలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న సింగిల్ విండో ఛైర్మన్ వెంకట్ రెడ్డి అక్కడికి వెళ్లి అన్నదాతలకు నచ్చజెప్పారు. గోనె సంచుల కొరతతో పాటు మరే సమస్యలు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు. శాంతించిన అన్నదాతలు ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి: కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న కరోనా