ETV Bharat / state

మేడమ్‌ నేను బతికే ఉన్నా... ఆ భూమి నాదే: వృద్ధుడి వేడుకోలు

‘మేడమ్‌.. నేను బతికే ఉన్నాను’ అంటూ ఓ వ్యక్తి నారాయణపేట కలెక్టరు హరిచందనకు వినతిపత్రం ఇచ్చారు. బతికుండగానే చనిపోయినట్లు ప్రొసీడింగ్స్‌ ఇచ్చి తన భూమిని సోదరుడి పేరు మీద పట్టా చేశారని పేర్కొన్నారు. ‘నేను బతికుండగానే చంపేశారు’.. అంటూ గత పది రోజులుగా నారాయణపేట కలెక్టరు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

man
man
author img

By

Published : Jun 17, 2020, 2:27 PM IST

రూ.కోట్ల విలువ చేసే భూమి వ్యవహారంలో ఓ వ్యక్తి బతికుండగానే చనిపోయినట్లు రెవెన్యూ అధికారులు ప్రొసీడింగ్స్ సృష్టించారు. ఆ వ్యక్తి వాటా కింద రావాల్సిన భూమిని అతని సోదరుడి పేరుపై మార్చారు. ఈ విషయం తెలిసిన బాధితుడు ‘నేను బతికుండగానే చంపేశారు’.. అంటూ గత పది రోజులుగా నారాయణపేట కలెక్టరు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.

‘నేను చనిపోయినట్లు పంచనామా ధ్రువపత్రం అధికారుల వద్ద ఏమైనా ఉందా? నా భూమిని ఇతరులకు కేటాయించినట్లు సంతకాలు చేసిన ఆధారాలు ఉంటే చూపెట్టండి. ఇవేవీ లేకుండా నా వాటా భూమిని అధికారులు నా సోదరుడి పేరుపై పట్టాగా ఎలా మార్చుతారు?’

-రామ్మోహన్‌రావు, బాధితుడు

‘మేడమ్‌.. నేను బతికే ఉన్నాను’ అంటూ నారాయణపేట కలెక్టరు హరిచందనకు వినతిపత్రం ఇచ్చారు. మక్తల్‌కు చెందిన రామ్మోహన్‌రావుకు ఇద్దరు సోదరులు ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ములకు కలిపి మక్తల్‌ మండలంలోని కాచ్‌వార్, ఉప్పర్‌పల్లి, మక్తల్‌లోని 11, 12, 13, 23, 24, 25 సర్వే నంబర్లలో సుమారు 110 ఎకరాల స్థలం ఉంది. దాదాపు రూ.13 కోట్ల విలువచేసే ఈ భూమి వారి తండ్రి అంబాజీరావు, తల్లి అనసూయల పేర్ల మీద ఉంది. ఇందులో కొన్ని సర్వే నంబర్లలోని భూమిని ముగ్గురు అన్నదమ్ములకు సమాన వాటా కింద పంచాల్సి ఉండగా.. తమ్ముడి పేరు మీద రెవెన్యూ అధికారులు పట్టా మార్పిడి చేశారన్నది ఆయన అభియోగం.

అలా ఎలా చేస్తారు

తాను చనిపోయినట్లు ప్రోసీడింగ్స్ తయారుచేసి తన వాటా భూమిని కూడా సోదరుడి పేరు మీద ఎలా పట్టాగా మారుస్తారని రామ్మోహన్‌రావు ప్రశ్నిస్తున్నారు. గతేడాది తాను ప్రమాదానికి గురై కాలికి దెబ్బ తగలడంతో కొన్నిరోజులు ఇంటికే పరిమితమయ్యానని.. ఈ సమయంలోనే భూముల మార్పిడి జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆ అధికారుల తీరే వేరు

తనకు న్యాయం చేయాలని ప్రతి అధికారి వద్దకు వెళ్లి బాధితుడు రామ్మోహన్‌రావు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై నారాయణపేట కలెక్టరేటు ఏవో మహమ్మద్‌ బిన్‌ ఖాలిద్‌ను ‘ఈనాడు’ వివరణ కోరగా.. ప్రజావాణిలో బాధితుడు ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనన్నారు. ఆ ఫిర్యాదును జిల్లా కలెక్టరు, డీఆర్‌వో దృష్టికి తీసుకెళ్తామన్నారు. బాధితుడు తన వద్ద అప్పీలు చేసుకుంటే విచారణ జరిపి న్యాయం చేస్తానని నారాయణపేట ఆర్డీవో శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.