నారాయణపేట జిల్లా జక్లేర్‌కు చెందిన వలస కుటుంబం హైదరాబాద్‌లో ఉంటూ ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారు. కరోనా ప్రభావంతో.. ఉపాధి లేక జీవనం భారమైన ఆ కుటుంబం ఇరవై రోజుల బాలింతతో కలసి ఉదయం 3 గంటలకు బయల్దేరింది. నానా తంటాలు పడుతూ చివరికి దేవరకద్రకు చేరుకుంది. వాళ్ల ఊరికి చేరాలంటే ఇంకా 34 కిలోమీటర్లు ప్రయాణించాలి. వాహనాలు నడవడం లేదు.
దిక్కుతోచని స్థితిలో రోడ్డు పక్కనే నీడలో ఉంటూ ఏ వాహనమైన దయదలచి తీసుకెళ్తుందని ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వర్లు పోలీస్ వాహనంలో తరలించాలని భావించారు, కానీ అప్పుడే రాయచూర్ వెళ్లే లారీ రావడం వల్ల ఆ లారీని ఆపి.. బాలింతతోపాటు కుటుంబ సభ్యులందరినీ అందులో ఎక్కించి పంపించారు.