నారాయణపేట జిల్లా బోయిన్పల్లి తండా పరిసర ప్రాంతాల్లో రెండు చిరుత పులుల సంచారాన్ని పశువుల కాపరులు చూసి గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. గ్రామంలో కొందరు చరవాణిల్లో పులుల సంచారం తీసి సామాజిక మాధ్యమాలో పోస్ట్ చేశారు.
ఈ ప్రాంతంలో చిరుతలు లేవని దేవరకద్ర, కర్ణాటక రాష్ట్రంలోని అటవీ ప్రాంతం నుంచి ఆహారం కోసం వచ్చే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
తండా పరిసర ప్రాంతాల్లో కనిపించినవి చిరుతలా లేక హైనాలా అనేది నిర్థరణ కావాల్సి ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల కాపరులు పశువులను ఇళ్ల వద్ద కట్టేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇదీ చదవండి: నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్