నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో లాక్డౌన్ కంట్మెన్మెంట్ జోన్ వెలుపల ఉన్న మద్యం దుకాణాలను తెరువనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మండల వ్యాప్తంగా మందుబాబులు మద్యం దుకాణాల ముందు బారులు తీరారు. సుమారు నెలన్నరగా మద్యం దుకాణాలు మూసి ఉండటం వల్ల ఎండను సైతం లెక్కచేయకుండా కొనుగోలుదారులు వరుసలో నిలుచుని మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. పలు దుకాణాల వద్ద భౌతిక దూరం నిబంధనలు పాటించకపోవడం వల్ల పోలీసులు లాఠీలకు పని చెప్పారు.
నారాయణపేటలో మద్యం కోసం జనం రద్దీ - wines shops opened
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా మద్యం ప్రియులు దుకాణాల ఎదుట బారులు తీరారు. ఉదయం నుంచే క్యూలైన్లో జనం రద్దీ కనిపించింది. పలు ప్రాంతాల్లో మందుబాబులు నిబంధనలను తుంగలో తొక్కారు.
దుకాణాల ఎదుట బారులు తీరిన మందుబాబులు