నారాయణపేట జిల్లా మద్దూరు, కోస్గీ మండల కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కొండగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ధాన్యం విక్రయించేందుకు రైతులు కంగారు పడొద్దని... ప్రతి గింజను కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. రైతులు ఇళ్లలోనే ఉండాలని... కేటాయించిన సమయంలో వచ్చి పంటను కొనుగోలు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇవీచూడండి: '2020-21లో భారత వృద్ధి రేటు 4.8 శాతమే'