నారాయణ పేట జిల్లా మక్తల్ పురపాలిక పరిధిలోని ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. ఫుట్‌పాత్‌ను ఆక్రమించి దుకాణాదారులు నిర్మించిన కట్టడాలను జేసీబీ సాయంతో తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ పావని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జనసంచారం అధికమవ్వడం, వాహనాలు రోడ్లపై ఎక్కువగా తిరుగుతున్న తరుణంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకే ఆక్రమణలు తొలగిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఫుట్‌పాత్‌ల పై అక్రమ కట్టడాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.