ETV Bharat / state

Harish Rao on BRS Manifesto : 'బీఆర్ఎస్​ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుంది' - Harish Rao on BRS Manifesto

Harish Rao on BRS Manifesto : అక్టోబర్ 15న వరంగల్ సభలో సీఎం కేసీఆర్ కొత్త మేనిఫెస్టోను ప్రకటిస్తారని హరీశ్​రావు పేర్కొన్నారు. అది చూస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుందని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. గత మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చామని హరీశ్​రావు గుర్తు చేశారు.

Narayanpet District
Harish Rao
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 4, 2023, 3:59 PM IST

Harish Rao on BRS Manifesto in Narayanpet District : నారాయణపేట జిల్లాలో మంత్రి హరీశ్‌రావు (Harish Rao) పర్యటిస్తున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రినే అంటారని.. సీఎం కుర్చీ కోసమే కొట్లాడుకునే వాళ్లు ప్రజలను ఏం పట్టించుకుంటారని విమర్శించారు. కేసీఆర్‌ లేకుంటే రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యేవారా అని ప్రశ్నించారు తెలంగాణ వచ్చినందునే ఇవాళ రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారని అన్నారు. అక్టోబర్‌ 15న వరంగల్ సభలో కొత్త మేనిఫెస్టోను కేసీఆర్ ప్రకటిస్తారని హరీశ్​రావు తెలిపారు.

BRS New Manifesto in October 15th : బీఆర్ఎస్​ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుందని హరీశ్​రావు వ్యాఖ్యానించారు. ఎన్ని కష్టాలు వచ్చినా.. గత మేనిఫెస్టోలో పెట్టిన హామీలు నెరవేర్చామని గుర్తు చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టలేదని తెలంగాణకు రూ.35,000 కోట్లు ఆపింది మోదీ సర్కార్‌ అని విమర్శించారు. పొరుగు రాష్ట్రం మోటార్లకు మీటర్లు పెట్టి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుందని అన్నారు. కేంద్రం నిధులు ఆపటంతో ఇబ్బందులు పడుతున్నాం కానీ మోటార్లకు మీటర్లు పెట్టలేదని హరీశ్​రావు వెల్లడించారు.

Harish Rao on New Schemes : 'త్వరలోనే సీఎం కేసీఆర్‌ కొత్త పథకాలను ప్రకటిస్తారు'

Harish Rao Started a 50 Bed Hospital in Kosgi : అంతకు ముందు హరీశ్​రావు కోస్గిలో (Kosgi) 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎసేనని, హాట్రిక్ సీఎం కేసీఆరేనని అన్నారు. భారత్ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజక వర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హరీశ్​రావు హామీ ఇచ్చారు.

Harish Rao Fires on Congress : కాంగ్రెస్‌ (Congress) పాలనలో 'నేను రాను బిడ్డో.. సర్కార్‌ దవాఖానాకు' అని పాడుకునే వారని హరీశ్‌రావు గుర్తు చేశారు. బిడ్డ కడుపున పడినప్పటి నుంచే ప్రభుత్వ సహాయం అందుతోందని చెప్పారు. గర్భిణీలకు రూ.12,000 ఇస్తున్నామని, కాన్పు తర్వాత కేసీఆర్ కిట్‌ (KCR Kit)ఇస్తున్నాం అందిస్తున్నట్లు వివరించారు. మాటలు చెప్పే సర్కార్‌ కావాలా?.. చేతల సర్కార్‌ కావాలా? అని అన్నారు. కొడంగల్ నియోజకవర్గానికి త్వరలోనే కృష్ణా జలాలు వస్తాయని హరీశ్​రావు వివరించారు.

Mulugu Medical College Foundation Stone : 'తెలంగాణ ఏ రంగంలో చూసినా ప్రథమ స్థానంలో ఉంది'

Harish Rao Visit to Narayanpet District Today : కొడంగల్‌కు ప్రస్తుతం కృష్ణా నుంచి తాగునీరు వస్తోంది, త్వరలోనే సాగునీరు వస్తుందని హరీశ్​రావు తెలిపారు. 3 గంటలు విద్యుత్‌ చాలు అనే రేవంత్‌ రెడ్డి కావాలా.. 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్‌ కావాలా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తారని విమర్శించారు. 12 లక్షల మంది ఆడపిల్లల వివాహాలకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేసినట్లు పేర్కొన్నారు. పొరుగున ఉన్న కర్ణాటకలో ఎలాంటి పథకాలు ఉన్నాయో తెలుసుకోవాలని హరీశ్​రావు వ్యాఖ్యానించారు.

Minister Harish Rao Reaction on Congress 6 Guarantees : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు కాదు.. ఆర్నెళ్లకో సీఎం వస్తారు: మంత్రి హరీశ్​రావు

కర్ణాటకలో వృద్ధాప్య పింఛనుగా రూ.600 మాత్రమే ఇస్తున్నారని.. అక్కడ రైతుబంధు, రూ.4,000 పింఛను ఎందుకు ఇవ్వట్లేదని హరీశ్​రావు ప్రశ్నించారు. ఆ రాష్ట్ర రైతులకు 7 గంటల విద్యుత్‌ కూడా ఇవ్వటం లేదని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్‌ గెలిచేది లేదని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి (Revanth Reddy) జైలుకు వెళ్లటం ఖాయమని అన్నారు. 3,000 తండాలను సీఎం కేసీఆర్‌ గ్రామ పంచాయతీలుగా మార్చారని హరీశ్​రావు గుర్తు చేశారు.

"ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు మహిళల కష్టాలు కేసీఆర్​ తీర్చారు. దాదాపు అన్ని ప్రభుత్వ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారు. మహిళల కోసం బీఆర్ఎస్​ అనేక పథకాలు తెచ్చింది. బీఆర్ఎస్​ ఎన్నికల ప్రణాళికలోనూ వారికి మరిన్ని పథకాలు ప్రకటిస్తాం. అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్.. తెలంగాణలో ఏం చేయగలదు?. 24 గంటలు విద్యుత్ కావాలంటే బీఆర్ఎస్.. 3 గంటలే చాలనుకున్న వాళ్లు కాంగ్రెస్​కు ఓటెయ్యాలి. బీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చాకే కొడంగల్ నియోజక వర్గంలో అభివృద్ధి సాధ్యమైంది. కోస్గిని రెవెన్యూ డివిజన్ చేయడం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం." - హరీశ్​రావు, మంత్రి

Harish Rao on BRS Manifesto బీఆర్ఎస్​ మేనిఫెస్టో చూస్తే ప్రతిపక్షాల దిమ్మ తిరుగుతుంది

Harish Rao On BJP Congress : 'రాష్ట్రంలో బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్​ గెలిచేది లేదు'

Harish Rao on Chandrababu Arrest : 'ఈ వయసులో చంద్రబాబును అరెస్టు చేయడం దురదృష్టకరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.