నారాయణ పేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చిట్యాల వాగులో నుంచి ఇసుక తీసుకొచ్చి విక్రయిస్తున్న వారు పోలీసులకు చిక్కారు.
తెల్లవారు జామున ట్రాక్టర్లతో ఇసుక తీసుకెళ్తున్న వారిని పెట్రోలింగ్ పోలీసులు విచారించగా ఇసుక అక్రమ రవాణా విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకుని ట్రాక్టర్లను సీజ్ చేశారు.