ETV Bharat / state

చెరువులు నింపే క్రమంలో ముంపునకు గురవుతున్న భూములు..! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

అందరూ సన్నకారు రైతులే. గతంలో వర్షాధారిత పంటలే సాగు చేసేవారు. తమ ప్రాంతంలో ప్రాజెక్టులు నిర్మించడంతో ఆ అన్నదాతలు చాలా సంబరపడ్డారు. పొలాలకు సాగునీరు వస్తుందని.. బాగా పండించాలని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. చెరువులు నింపే క్రమంలో వ్యవసాయ భూములు ముంపునకు గురై.. సాగు చేయడానికి వీలు లేకుండా పోయింది. వందల ఎకరాల సాగు భూమి ముంపునకు గురైంది.

farmland-flooded-and-there-is-no-chance-for-farming-in-farmers-land-narayanpet-district
చెరువులు నింపే క్రమంలో ముంపునకు గురవుతున్న భూములు.. రైతుల ఆవేదన!
author img

By

Published : Mar 23, 2021, 4:45 PM IST

నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని సంగంబండ, కోయిల్ సాగర్ జలాశయాల ప్రధాన కాలువల నుంచి చెరువులు నింపుతున్న క్రమంలో శిఖం భూములతో పాటు పట్టా భూములు ముంపునకు గురవుతున్నాయి. రైతులకు సొంత భూములు ఉన్నా సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. నారాయణపేట జిల్లా నర్వ మండలంలోని మూడు గ్రామాల చెరువుల కింద 152 ఎకరాల పట్టా భూములు ముంపునకు గురయ్యాయి.

పట్టా భూములూ ముంపు

నర్వ మండలంలోని పెద్ద చెరువుకు సంగంబండ ప్రధాన కాలువ ద్వారా కొన్నేళ్లుగా సాగునీటిని ఇస్తున్నారు. చెరువు శిఖం విస్తీర్ణం 149.33 ఎకరాలు. నీటి నిల్వలు గరిష్ఠ మట్టాన్ని దాటి అలుగు పై భాగం వరకు నింపుతున్నారు. ఈ క్రమంలో శిఖం భూమితో పాటు చాలా మంది రైతుల పట్టా భూములు సుమారు 109.29 ఎకరాల వరకు ముంపునకు గురవుతున్నాయి. సర్వే నంబరు 106లో 24 ఎకరాలు, ప్రభుత్వ భూమిలో 20 ఎకరాల వరకు మునిగిపోయింది. సర్వే నంబర్ 116లో ఆలయాల భూమి 1.22 ఎకరాలు మునిగిపోగా.... కేవలం 0.18 ఎకరాలు మాత్రమే మిగిలింది.

సాగుకు నోచుకోని భూములు

లంకాలలో రెడ్డి చెరువు, రాంపూర్ చెరువుల్లో కోయిల్ సాగర్ ప్రధాన కాలువ ద్వారా కొన్నేళ్లుగా నీటిని నింపుతున్నారు. లంకాల రెడ్డి చెరువు సర్వే నంబర్లు 380-394 వరకు మొత్తం 113.03 ఎకరాల్లో నీరు నింపుతుండగా... వీటిలో రైతులకు సంబంధించిన 26 ఎకరాల 36 గంటల పట్టా భూమి నీటిలో మునిగింది. రాంపూర్‌లో సర్వే నంబర్ 81లో మొత్తం 62.11 ఎకరాలు ఉండగా ఇందులో 45.29 ఎకరాలు చెరువు ప్రభుత్వ భూమి.. కొంత మంది రైతులకు సంబంధించి 16.22 ఎకరాల్లో సాగుకు వీలు కాకుండా ఉంది.

చెరువులు నింపే క్రమంలో ముంపునకు గురవుతున్న భూములు.. రైతుల ఆవేదన!

ఇదీ చదవండి: పర్యాటక రంగానికి నిధులు కేటాయించడం సంతోషకరం: శ్రీనివాస్ గౌడ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.