ETV Bharat / state

మంథన్​ గోడ్​లో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం - mantri paryatana

నారాయణపేట జిల్లా మక్తల్​ మండలం మంథన్​ గోడ్​లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం కూలీలకు కిరాణా సామగ్రిని పంపిణీ చేశారు.

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

author img

By

Published : Apr 28, 2020, 8:13 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. మంథన్ గోడ్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. లాక్​డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కూలీలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, బియ్యం, పండ్లు పంపిణీ చేశారు. కష్ట కాలంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ భరోసా ఇచ్చారు. ఇతర దేశాల్లో తినడానికి తిండి కూడా లేదని.. కానీ రాష్ట్రంలో పేదలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని వెల్లడించారు.

లాక్​డౌన్​లో ధాన్యం కొనుగోలు చేసేందుకు గ్రామాల వద్దకే వచ్చి కొంటున్నామని మంత్రి పేర్కొన్నారు. నిరంతర విద్యుత్, ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నారాయణపేట కలెక్టర్ హరిచందన, ఆర్డీవో శ్రీనివాసులు, నారాయణపేట జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ వనజ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : సెప్టెంబర్​ నాటికి కరోనా వ్యాక్సిన్ సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.