నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న మొహర్రం ఏర్పాట్లను ఎస్పీ డాక్టర్ చేతన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పదో రోజు సాయంత్రం హసన్, హుస్సేన్ పీర్లను నిమజ్జనానికి తరలించే ఆయా ప్రాంతాల్లో బందోబస్తును పరిశీలించారు. అక్కడ పరిస్థితులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఊరేగింపులో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మధుసూదన్‌రావు, సీఐ శంకర్, ఎస్సై రషీద్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి : నేడు ఈసెట్ పరీక్ష... కరోనా కాలంలో తొలి పరీక్ష