నారాయణపేట జిల్లాలో ఏర్పాటుచేసిన భాజపా కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి డీకే అరుణ హాజరయ్యారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు కొత్త చట్టాన్ని హడావుడిగా ప్రతిపాదించేందుకు సీఎం కేసీఆర్ తొందర పడుతున్నారని అరుణ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాజపా గెలుపు ఖాయమని... ఓటమి భయంతోనే ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇచ్చేందుకు తొందరపడుతుందని తెలిపారు. కేటీఆర్ ట్విటర్ పిట్ట అని విమర్శించారు. కేంద్రం నిధులు ఇవ్వటం లేదని ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు.
ఇవీ చూడండి: ఈఎస్ఐలో అక్రమాలను నిగ్గుతేల్చే పనిలో అనిశా