నారాయణపేట జిల్లా పరిధిలో బాలకార్మికుల నిర్మూలనకు గత నెల ప్రత్యేక బృందాలు 'ఆపరేషన్ ముస్కాన్' నిర్వహించాయి. ఇప్పటివరకు 109 మంది బాల కార్మికులను గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చినట్లు ఎస్పీ చేతన తెలిపారు. పిల్లలను మండలాల వారీగా బడిలో చేర్పించామన్నారు. చిన్నారులతో పనులు చేయించిన యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బడి బయట ఉండి చదువుపై ఆసక్తి ఉన్న పిల్లలకు స్కూల్ బ్యాగ్, పెన్నులు, షూ, పుస్తకాలు అందించారు. ఇద్దరు విద్యార్థులకు తల్లిదండ్రులు లేనందున దుస్తులు సైతం అందించారు. బాలకార్మికులను ఎక్కడ పనిలో పెట్టుకున్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చేతన హెచ్చరించారు.
ఇవీ చూడండి: సాహిత్యంలో వీళ్లు పిల్లలు కాదు పిడుగులు