Delay in Thimmareddipalli Bridge Works Narayanpet : నారాయణపేట జిల్లా మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామం. మహబూబ్‌నగర్ మద్దూరు ప్రధాన రహదారి నుంచి ఈ గ్రామానికి వెళ్లాలంటే ముందుగా వాగు దాటాలి. వానాకాలం వాగు పొంగితే ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. అలా ఏడాదిలో రెండు, మూడు నెలలు గ్రామస్థులు ప్రమాదకరంగా వాగుదాటుతూ ప్రయాణాలు కొనసాగిస్తారు.
తిమ్మారెడ్డిపల్లి(Thimmareddipalle) వాసులే కాదు. సమీప గ్రామాలైన నందిగామ, గోకుల్ నగర్, దుప్పటిగట్టు, బూనేడు సహా ఆ గ్రామానికి ఆనుకుని ఉన్న తండా ప్రజలంతా ఆ వాగు దాటే వెళ్లాలి. వాగు ఉద్ధృతంగా ప్రవహించినప్పుడు.. చుట్టూ 12కిలోమీటర్లు తిరిగి మహబూబ్ నగర్-మద్దూరు ప్రధాన రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య ఇప్పటిది కాదు.. స్వాతంత్య్రానికి ముందు నుంచే గ్రామస్తులు ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అక్కడ విద్యుత్త్ స్తంభమే వంతెన... బ్రిడ్జి కట్టాలని విద్యార్థుల అభ్యర్థన
Sri Guru Lokamasand Maharaj (Bavoji gudi) : రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన బావోజీ(Bavoji) జాతర ఏటా ఏప్రిల్ మొదటివారంలో తిమ్మారెడ్డిపల్లి గ్రామంలోనే జరుగుతుంది. లక్షలాది మంది గిరిజనులు ఈ జాతరకు హాజరవుతుంటారు. అ సమయంలో వాగులో తాత్కాలిక రోడ్డు నిర్మించి రాకపోకల్ని సులభతరం చేస్తారు. మళ్లీ వానాకాలంలో వాగుపొంగి ఆ రోడ్డుకు కొట్టుకుపోతుంది. జాతర సమయంలో మళ్లీ తాత్కాలిక మట్టి రోడ్డు నిర్మిస్తారు.
తిమ్మారెడ్డిపల్లి వంతెన మాకు దశాబ్దాల కల. ఎన్నో ఏళ్ల నుంచి బ్రిడ్జి నిర్మాణం జరగక అలానే ఉంది. మా ఊరుకి ప్రధాన రహదారి ఇదే. ప్రతి ఒక్కరు ఈ వాగుపై నుంచే పనులకు, చదువుకోవటానికి వెళ్లేది. ప్రయాణాలకు చాలా కష్టమౌతుంది. కానీ పట్టించుకునే వారు లేరు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రమే.. మా కష్టాలు గుర్తొచ్చేది. తర్వాత ఏ పార్టీ వారు కూడా దీనిపై స్పందించరు. ఎట్టకేలకు గత ఏడాది బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా.. పనులు మాత్రం సాగటం లేదు. - గ్రామస్థులు
Bridge Works Delay at Narayanpet District : సాధారణ సమయాల్లో ఆ గ్రామానికి అంబులెన్స్ రావడం కూడా ఇబ్బందే. ఒకప్పుడు ఈ గ్రామానికి బస్సులు కూడా నడిచేవి. ఏటా వాగు పొంగడం, రోడ్డు కొట్టుకుపోవడంతో రహదారి అధ్వానంగా మారి బస్సులు కూడా నిలిపివేశారు. 2 కిలోమీటర్లు నడిచి ప్రధాన రహదారికి చేరుకుంటేనే అక్కడి నుంచి మహబూబ్‌నగర్, మద్దూరు కేంద్రాలకు బస్సులు దొరికేది. నిత్యం 2 వేలకు పైగా వాహనాలు ప్రయాణించే ఈ దారిలో వాగుపై వంతెన నిర్మించాలన్నది తిమ్మారెడ్డిపల్లి ప్రజల చిరకాల వాంఛ.
కూలిన వంతెన.. మూడు మండలాలకు నిలిచిపోయిన రాకపోకలు
గత ఏడాది ఏప్రిల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన(Foundation) చేశారు. దీంతో ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోందని గ్రామస్థులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వంతెన నిర్మాణ పనులు ఏడాది గడిచినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి. వచ్చే బావోజీ జాతర సమయానికికైనా వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ప్రస్తుతం వానల్లేక తాత్కాలిక రహదారిపైనే రాకపోకలు కొనసాగుతున్నాయి. తరచూ వాగులో నీళ్లు నిలవడంతో వంతెన పనులకు సైతం ఆటంకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు(Officers) చొరవ చూపి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Hyderabad Steel Bridge Features : భాగ్యనగర సిగలో మరో మణిహారం.. స్టీల్ బ్రిడ్జి ప్రత్యేకతలు ఇవే..?