నారాయణపేట జిల్లా నర్వ మండలం యాంకి గ్రామంలోని చెరువులో మొసలి కలకలం రేపుతోంది. గత నెల రోజుల నుంచి చెరువులో మొసలి కనిపిస్తోందని.. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. రిజర్వాయర్ నీటి ద్వారా మొసలి చెరువులోకి చేరి ఉంటుందని భావిస్తున్నారు.
ఇటీవల చేపల సంఘం సొసైటీ ఆధ్వర్యంలో చెరువులోకి చేపలను వదిలారని... మొసలి చెరువులో వదిలిన చేపలను తింటుందని మత్స్యకారులు అంటున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు స్పందించి చెరువులో కనిపించిన మొసలిని పట్టుకొని నదిలోకి వదలాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: సాంకేతికతతో అధిగ దిగుబడులు : శ్రీనివాస్ గౌడ్