నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోకి కృష్ణమ్మ ప్రవేశించింది. ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం నుంచి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీరు జూరాల వైపు పరుగులు తీస్తోంది. ఉరకలెత్తుకొస్తున్న కృష్ణమ్మ పరవళ్లతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీతీర గ్రామాల్లో కలెక్టర్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇవీ చూడండి: ఇతని ఆకుకూరలు రుచికరం...ఆరోగ్యం