నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావ్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వనజ, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలుకోసం దళారులను ఆశ్రయించొద్దని.. అధికారులెవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టకి తీసుకురావాలని కోరారు.
ఇవీ చూడండి: "కల్యాణలక్ష్మి ఆలస్యమవుతోంది... ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా"