నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముష్టిపల్లిలో కలెక్టర్ హరిచందన పర్యటించారు. ముష్టిపల్లి వందశాతం బహిరంగ మలవిసర్జన రహితమైందన్నారు. అందుకే జాతీయ హరిత ట్రిబ్యునల్‌కి ఎంపికైందని చెప్పారు. గ్రామంలో తడి, పొడి చెత్త వేరుచేసే షెడ్డును పరిశీలించారు.
అనంతరం పలు వీధుల్లో కలియ తిరుగుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను, మురుగు కాలువలను పరిశీలించారు. గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని గ్రామ అధికారులకు సూచించారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉన్నందుకు 'మంకీ ఫుడ్ కోర్ట్' ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇవీ చూడండి: బంగారు తెలంగాణ దిశగా.. పచ్చని మాగాణియే లక్ష్యం