నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో జిల్లా పాలనాధికారి హరిచందన పర్యటించారు. మండలంలోని చిట్టెం నర్సిరెడ్డి జలాశయాన్ని పరిశీలించారు. ప్రాజెక్టు కాలువలు, రిజర్వాయర్ సామర్థ్యం, పెండింగ్ పనుల పురోగతిని నీటి పారుదల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయకట్టు కింద సాగు విస్తీర్ణంపై ఆరాతీశారు.
అనంతరం ఖానాపూర్ లిఫ్ట్‌ను పరిశీలించిన కలెక్టర్‌కు... బీమా ప్రాజెక్ట్ ఫేజ్ వన్ లిఫ్ట్-2లో భాగంగా ఎత్తిపోతల గురించి అధికారులు వివరించారు. సంగంబండ రిజర్వాయర్‌ను వందశాతం పూర్తిచేసి, రైతులకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాలనాధికారి వెంట ఆర్డీవో శ్రీనివాసులు, తహసీల్దార్ నర్సింగ్ రావు, ఈవోపీఆర్డీ పావని, సాగునీటిశాఖ అధికారులు ఉన్నారు.