ETV Bharat / state

పరిహారం కోసం ఆందోళన.. హామీ ఇచ్చిన కలెక్టర్ - district collector

నారాయణపేట జిల్లాలో మట్టి దిబ్బ కూలిన ఘటనలో బాధిత కుటుంబాలు న్యాయం కోసం రోడ్డెక్కాయి. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మృతదేహాలతో రోడ్డుపై బైఠాయించి పరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందిస్తాం : కలెక్టర్
author img

By

Published : Apr 10, 2019, 10:15 PM IST

నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరులో మట్టిదిబ్బ కూలి పదిమంది మృతి చెందారు.వ ఈ ఘటనలో పరిహారం చెల్లించాలని కోరుతూ రహదారిపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ధర్నాతో రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. స్పందించిన జిల్లా కలెక్టర్ ఒక్కో కుటుంబానికి 5లక్షల పరిహారం ప్రకటించారు.

అర్హులకు కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తాం

బాధిత కుటుంబ సభ్యుల్లోని విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ఉచిత ప్రవేశం, అర్హులైన వారిలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామన్నారు. అందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, అర్హులైన కుటుంబాలకు మూడెకరాల భూమి అందజేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. శాంతించిన బాధిత సభ్యులు ఆందోళన విరమించి మృతదేహాలను స్వగ్రామానికి తీసుకెళ్ళారు.

ఒక్కో కుటుంబానికి 5లక్షల పరిహారం ప్రకటించిన జిల్లా కలెక్టర్

ఇవీ చూడండి : తప్పని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తాం: దాసోజు

Intro:Tg_Mbnr_15_10_Shevalatho_Dharna_Avb_G3 నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరులో మట్టి కూలి మృతి చెందిన పదిమంది బాధితుల కుటుంబ సభ్యులు గ్రామస్తులు శవాలతో రోడ్డుపై బైఠాయించి ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆందోళన చేపట్టారు

Body:తీలేరులో లో మట్టికి కూలి మృతి చెందిన బాధితులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని 167 రహదారిపై బాధిత కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు జోక్యం చేసుకొని వాహనాలను దారి మళ్లించే ప్రయత్నం చేశారు . అంతలోనే నారాయణపేట జిల్లా కలెక్టర్ స్పందించి ఒక్కొక్క కుటుంబానికి 5లక్షల ఎక్స్గ్రేషియా, బాధిత కుటుంబ సభ్యు లలో చదువుకునే విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ఉచిత అడ్మిషన్స్, బాధిత కుటుంబాల్లో అర్హులైన వారిలో ఒక్కరికి కాంట్రాక్టు ఉద్యో గం. రెండు పడకల ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా అర్హులైన కుటుంబాలకు మూడెకరాల భూమి అందజేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తాం అని నారాయణపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు బాధిత కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు హామీ ఇవ్వడంతో తో ఆందోళన విరమించారు మృతదేహాలను గ్రామానికి తీసుకొనివెళ్ళారు.

Conclusion:కలెక్టర్ హామీ తో ఆందోళన విరమించిన తీలేరు గ్రామస్తులు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.