నారాయణపేట జిల్లా మక్తల్లో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 34వ వర్ధంతి నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద తహసీల్దార్ శ్రీనివాసులు ఐలమ్మ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరురాలు ఐలమ్మ అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.
ఇదీచూడండి: రైతు సమస్యలపై శాసనసభలో పోరాటం: సీఎల్పీ