నారాయణపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా నేతలు ఆందోళనకు దిగారు. భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో జిల్లాలో పత్తి, కంది పంటలు వేసిన రైతులు.. పంటంతా నీటమునిగి నష్టపోయారని తెలిపారు.
వరిలో సన్నరకాలను ఎక్కువ మోతాదులో వేసిన రైతులు దారుణంగా నష్టపోయారని ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు పరిహారం అందించాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.
- ఇదీ చదవండి : వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు.. ఎందుకంటే?