ఎమ్మెల్యే ఎస్ఆర్ రెడ్డి చేస్తున్న కుంభకోణాలు బోఫోర్స్ కేసు కంటే అధికమని భాజపా రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ ఆరోపించారు. నారాయణపేట మున్సిపాలిటీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నాయకులతో ధర్నా నిర్వహించారు.
సమస్యలు పట్టవా?..
నారాయణపేట, మక్తల్ ఎమ్మెల్యేల తీరుపై నాగూరావు నామాజీ తీవ్ర విమర్శలు చేశారు. పట్టణ ప్రజల సమస్యలు ప్రజాప్రతినిధులకు పట్టవా అంటూ ప్రశ్నించారు. ప్రధానంగా మంచినీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి. వార్డుల వారిగా సమస్యలు గుర్తించి అధికారులు వెంటనే పరిష్కరించాలి. శంకుస్థాపన చేసి నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు మినీ స్టేడియం ప్రారంభించలేదు.
-నాగూరావు నామాజీ, భాజపా రాష్ట్ర నాయకులు
14.29 ఎకరాల సూర్య లక్ష్మీ డిగ్రీ కళాశాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, రఘురాం, భాజపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రైతులను ముంచేందుకే కొత్త చట్టాలు: జీవన్‌రెడ్డి