నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, సీనియర్ సివిల్ జడ్జి... మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ద్వారా మహిళల సంరక్షణ చట్టాలపై వర్క్ షాప్ నిర్వహించారు. ''ఇరువర్గాల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న భూములకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, పంపకాలకు సంబంధించి, చట్టప్రకారం రాజీ పడదగిన నేరాలకు... ఇరువర్గాల మధ్య చట్ట సమ్మతమైన రీతిలో తగువులను పరిష్కరించడమే'' లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ హరిచందన పేర్కొన్నారు.
లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పు అన్ని రకాలుగా కోర్టు తీర్పుతో సమానమని ఎస్పీ చేతన తెలిపారు. అన్ని విషయాలను పరిశీలించిన తరువాత మాత్రమే ఇరుపక్షాలకు తగిన సమయం ఇచ్చి వారి సమ్మతి ప్రకారమే తీర్పు ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. కనుక తీర్పుపై అప్పీలు చేసుకునే అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: అపహరణకు గురైన మూడేళ్ల బాలుడి ఆచూకీ లభ్యం