నారాయణపేట జిల్లాలో వసతి గృహ విద్యార్థులకు మంచి రోజులు రాబోతున్నాయి. వసతి గృహాల్లో ఉన్న సమస్యలు నివారించి గాడిలో పెట్టేందుకు కలెక్టర్ వెంకట్రావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే విధంగా ఆత్మీయుడు.. విద్యార్థులకు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా... జిల్లాలోని ప్రతి అధికారికి ఒక వసతిగృహాన్ని అప్పగించారు. వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు ఇంటి వాతావరణాన్ని కల్పించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చదువు కొనసాగించే విధంగా చొరవ తీసుకోవాలని సూచించారు.
- ఇదీ చూడండి : అక్రమ నల్లా కనెక్షన్ల క్రమబద్ధీకరణకు మరో అవకాశం