నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. జిల్లా కేంద్రానికి చెందిన పళ్ల అనంతమ్మ అనే మహిళ పురిటి నొప్పులతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. వెంటనే పరిశీలించిన వైద్య బృందం తల్లి కడుపులో ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి సాధారణ కాన్పు చేశారు.
ఫలితంగా ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలతో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, ముగ్గురు పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న బంధువులు హర్షం వ్యక్తం చేశారు.