ఉద్యోగ ప్రకటనలు లేక, తల్లిదండ్రులకు భారం కాలేక యువత ప్రాణాలు తీసుకుంటోందని... వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు (YS SHARMILA PROTEST). ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... కేసీఆర్‌కు చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు. ప్రతి మంగళవారం నిర్వహించే నిరుద్యోగ నిరాహారదీక్షలో (ys sharmila hunger strike) భాగంగా షర్మిల... నల్గొండలో పర్యటించారు. క్లాక్‌టవర్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై సాయంత్రం వరకు దీక్షకు కూర్చున్నారు (ys Sharmila dheeksha). వైఎస్ హయాంలో... అయిదేళ్ల కాలంలోనే మూడు ఉద్యోగ ప్రకటనలు వచ్చాయని షర్మిల గుర్తుచేశారు.
నిర్లక్ష్య నీడలో...
నల్గొండ చేరుకునే క్రమంలో షర్మిల... మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం వద్ద ఆగి... కాసేపు మాట్లాడారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. వీసీలు, ఇతర సిబ్బంది నియామకాలు లేక చదువులు సాగే పరిస్థితి లేకుండా పోయిందని మండిపడ్డారు.
ఆ భయంతోనే...
హుజూరాబాద్‌లో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్... అన్ని వ్యవస్థల్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారని షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఇదీ చూడండి: YS SHARMILA PROTEST: వైఎస్ పేరెత్తే అర్హత కేసీఆర్‌కు లేదు: షర్మిల