ETV Bharat / state

Drugs Addiction: మత్తుకు యువత చిత్తు.. ఆందోళనకరంగా పరిస్థితులు - నల్గొండ వార్తలు

‘మత్తు’ కోసం యువతలో కొత్తదారులు తొక్కుతోంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారు నొప్పి నివారణ మాత్రలు మత్తుకోసం వాడుతున్నట్లు బయటపడింది. ‘ట్రెమడాల్‌’ సమ్మిళిత ఔషధాన్ని ఇలా వాడుతున్నట్లు తేలింది. చాలా మందుల షాపుల్లో వీటిని వైద్యుల సిఫార్సు లేకుండానే అమ్ముతున్నట్లు వెల్లడైంది. నల్గొండలో ఇది వెలుగులోకి రావడంతో.. రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ అప్రమత్తమైంది.

drugs addiction in youth
మత్తుకు యువత చిత్తు
author img

By

Published : Oct 8, 2021, 4:54 AM IST

‘మత్తు’ కోసం యువతలో కొందరు కొత్తదారులు వెతుకుతున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడినవారు గంజాయి, కొకైన్‌ వంటివి వినియోగిస్తుంటారు. కొందరు దగ్గు మందు, నిద్రమాత్రలను వాడుతున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది. తాజాగా నొప్పి నివారణ మాత్రలనూ మత్తు కోసం వినియోగిస్తున్నారని తేలడం ఆందోళనకరం. ‘ట్రెమడాల్‌’ సమ్మిళిత ఔషధాన్ని ఇలా వాడుతున్నట్లు తేలింది. చాలా మందుల షాపుల్లో వీటిని వైద్యుల సిఫార్సు లేకుండానే అమ్ముతున్నట్లు వెల్లడైంది. నల్గొండలో ఇది వెలుగులోకి రావడంతో.. రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ అప్రమత్తమైంది. దీనిపై లోతుగా విచారణ జరపాలని జిల్లాల్లోని ఔషధ నియంత్రణాధికారులను ఆదేశించింది.

వెలుగులోకి ఇలా..

మాదక ద్రవ్యాల వినియోగం, అమ్మకాలపై దృష్టిపెట్టిన పోలీసులు ఇటీవల నల్గొండలో కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మత్తు కోసం వారు నొప్పి నివారణ మాత్రలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఏయే దుకాణాల్లో కొన్నారో తెలుసుకుని ఔషధ నియంత్రణాధికారుల సహకారంతో దాడులు జరిపారు. అప్పటికే వేల సంఖ్యలో ‘ట్రెమడాల్‌’ ఔషధం సమ్మిళిత మాత్రలను విక్రయించినట్లు బయటపడింది. సాధారణం కంటే దాదాపు పదింతలు అధికంగా అమ్మకాలు జరిగాయని తేలింది. ఆ దుకాణాలపై కేసులు నమోదు చేశారు. ఒక దుకాణదారును అదుపులోకి తీసుకున్నారు. మిర్యాలగూడ, నల్గొండలలో మరో మూడు షాపులకు తాఖీదులను ఇచ్చారు.

ఎందుకు దీని వైపు మొగ్గు?

‘పారాసెటమాల్‌, డైసైక్లోమైన్‌, ట్రెమడాల్‌’ సమ్మిళిత ఔషధాన్ని తీవ్రమైన నొప్పి నివారణ కోసం వైద్యులు సూచిస్తుంటారు. శస్త్రచికిత్స అనంతరం వాడుతుంటారు. ఒంటి నొప్పులు, తలనొప్పి, నెలసరి సమయంలో నొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, పంటి నొప్పి, చెవిపోటు తీవ్రంగా ఉన్నపుడు వినియోగిస్తుంటారు. ఈ మాత్రలలోని ఔషధ గుణం మెదడు నుంచి నొప్పికి సంబంధించిన సంకేతాలను నిరోధిస్తుంది. ముఖ్యంగా ‘ట్రెమడాల్‌’ అనే ఔషధం ‘ఓపియాయిడ్స్‌’ అనే మాదక ద్రవ్యాల జాబితాకు చెందినది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసి నొప్పి తెలియకుండా చేస్తుంది. ఇదే సమయంలో కొంత మత్తు కలగజేస్తుంది. అందుకే కొందరు మత్తు మందుగా వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

నిబంధనల ఉల్లంఘన ఇలా..

వైద్యుల సిఫార్సు లేకుండా ఈ ఔషధాన్ని అమ్మకూడదు. అర్హత కలిగిన వైద్యుడు రాసిస్తే.. ఆ చీటీ నకలును తమ వద్ద అట్టిపెట్టుకోవాలి. ఏ వైద్యుడు రాశారు? ఎన్ని మాత్రలు రాశారు? ఎవరికిచ్చారు? తదితర సమాచారమంతా నమోదుచేసి ఉంచాలి. చాలా దుకాణాల్లో ఈ నిబంధనకు తూట్లు పొడిచి విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. ఏటా రూ.కోట్ల విలువైన ట్రెమడాల్‌ ఔషధాలు అమ్ముడవుతున్నట్లు ఔషధ నియంత్రణ సంస్థ గుర్తించింది.

చికిత్స కూడా కష్టమే

దగ్గు మందు, నిద్రమాత్రలు, ట్రెమడాల్‌ వంటి ఔషధాలను దీర్ఘకాలం వాడితే నయం చేయడం కూడా కష్టం. వీరు ఒకేసారి 10-20 మాత్రలు వేసుకుంటారు. ఇది మానసికంగానే కాదు ఆర్థికంగానూ ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలూ వస్తుంటాయి. కిక్కు కోసం కొందరు వీటిని ఆల్కహాల్‌లో కలుపుకొని వాడుతుంటారు. దీనికి దీర్ఘకాలిక చికిత్స అవసరం.

-డాక్టర్‌ ప్రసాదరావు,మానసిక వైద్యనిపుణులు

తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు

ట్రెమడాల్‌, పెంటాజోసిన్‌ వంటి ఔషధాలను దీర్ఘకాలం వాడితే వాటికి బానిసలుగా మారతారు. నొప్పి మాత్రలను ఎక్కువగా వాడితే కిడ్నీలు దెబ్బతింటాయి. తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. కొందరు నాటు మందులు విక్రయించే వారు.. స్టెరాయిడ్స్‌ను కలిపి విక్రయిస్తుంటారు. అవి కూడా బానిసగా మారుస్తాయి. స్టెరాయిడ్స్‌ దీర్ఘకాలం వాడడం వల్ల బీపీ, షుగర్‌ వస్తాయి. ఎముకలు బలహీనమవుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే ఏ మందునూ అనవసరంగా వాడొద్దు.

-డాక్టర్‌ ఎంవీ రావు, జనరల్‌ ఫిజీషియన్‌

నియంత్రణాధికారులు తగినంత లేకనే

రాష్ట్రంలో దాదాపు 40 వేల ఔషధ దుకాణాలుంటే.. చాలా షాపుల్లో ఫార్మాసిస్టులు ఉండడం లేదు. వీటిలో ఎంతమంది వైద్యుల చీటీని దాచిపెడుతున్నారనేది ప్రశ్నార్థకమే. చీటీ లేకుండా అమ్మడం ఒక కుంభకోణంగా మారింది. దీన్ని నివారించాలి. తగినంత మంది ఔషధ నియంత్రణాధికారులు లేకపోవడంతో నియంత్రణ కరవైంది.

-డాక్టర్‌ ఆకుల సంజయ్‌రెడ్డి, ఫార్మకాలజిస్ట్‌, తెలంగాణ ఔషధ మండలి సభ్యులు

ఇదీ చూడండి: ganja cultivation in hyderabad: యువకుల హైటెక్ డ్రగ్స్ దందా.. ఇంట్లోనే గంజాయి సాగు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.