ETV Bharat / state

పుట్టినరోజు వేడుకలకు వెళ్లి.. యువకుడు అదృశ్యం - young man missing mother files case

స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన యువకుడు కనిపించకపోయిన ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన సుందర్​ నగర్​లోని వేముల కోటేష్​ ఈ నెల 17న స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన తల్లి మిర్యాలగూడ ఒకటవ పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

young man missing in miryalaguda
పుట్టినరోజు వేడుకలకు వెళ్లి.. యువకుడు అదృశ్యం
author img

By

Published : May 19, 2020, 5:48 PM IST

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని సుందర్​ నగర్​కు చెందిన వేముల కోటేష్​ (22) ఈ నెల 17న స్నేహితులతో కలిసి పట్టణంలోని తుమ్మడం కోట మైసమ్మ వద్ద పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లాడు. రెండు రోజులైనా తిరిగి ఇంటికి రాలేదు. కంగారు పడిన తల్లి మిర్యాలగూడ ఒకటవ పట్టణ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. కోటేష్​ స్నేహితులను నిలదీయగా.. సాగర్​ ఎడమ కాలువలో పడిపోయాడని.. ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం చెప్పారు. పొంతన లేని సమాధానాలు చెప్పడం వల్ల వారిని అనుమానించిన మిర్యాలగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవమాసాలు మోసి కన్న కొడుకు కనిపించకుండా పోవడం వల్ల ఆ తల్లి గుండెలు పగిలేలా ఏడుస్తున్న దృశ్యం చూసేవారిని కంటతడి పెట్టిస్తున్నది.

ఇవీ చూడండి: 'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.