ETV Bharat / state

కొవిడ్​ కాటు: ఫైనాన్స్ వేధింపులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య - ఒత్తిడితో యువకుడి ఆత్మహత్య

''పెద్దగా చదువుకోలేదు. కానీ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలనే ఆలోచన. సరే వచ్చిన పనే చేసుకుందాం అనుకున్నాడు. ఫైనాన్స్​లో ఆటో తీసుకున్నాడు.'' ప్రతినెలా ఫైనాన్స్ చెల్లించేవాడు. ఇంతలోనే కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసింది. ఆ వైరస్​తోనే అతని ఆశలు అడియాసయ్యాయి. ఫైనాన్స్​ వేధింపులు పెరిగాయి. సమయం కావాలని వేడుకున్నా కనికరించకపోవడంతో చివరికి తనువుచాలించాడు ఓ యువకుడు.

young-man-committed-suicide-with-mental-pressure-in-nalgonda-district
ఈ ఒత్తిడి నేను భరించలేనంటూ యువకుడి ఆత్మహత్య
author img

By

Published : Jul 8, 2020, 7:54 PM IST

నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన గడ్డం శ్రీకాంత్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనాన్స్​లో ఆటో తీసుకుని... జీవనాన్ని సాగిస్తున్న అతనికి కరోనా పెద్ద నష్టాన్నే మిగిల్చింది.

కరోనా నేపథ్యంలో కిరాయిలు లేక నష్టపోతున్న అతనికి... ఫైనాన్స్ కంపెనీ నుంచి ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇక చేసేదేమీ లేక... ఒత్తిడితోనే తనువు చాలిస్తున్నానంటూ సూసైడ్​ నోట్​ రాసి చనిపోయాడు. తల్లిదండ్రులు ఫైనాన్స్ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి: టిక్​టాక్​ ఫీచర్లతో ఇన్​స్టాగ్రామ్ 'రీల్స్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.