తాను ఏ పదవిలో ఉన్నా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, కార్యకర్తలు, అభిమానులు తనను ఏ సమయంలోనైనా కలవొచ్చని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఏఆర్సీ కళ్యాణ మండపంలో తెరాస కార్యకర్తలు, వివిధ కుల, వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో ఆయనకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి ప్రజా ప్రతినిధులకు సమన్వయకర్తగా వ్యవహరించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గుత్తా పేర్కొన్నారు. వచ్చే పది సంవత్సరాల పాటు సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటారని... ఆయన హయాంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మిర్యాలగూడలో పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఐక్యరాజ్యసమితి వేదికగా 'హద్దు' మీరిన ఇమ్రాన్..!