ETV Bharat / state

Open Air Prison: భూమి కేటాయించినా మొదలుకాని పనులు - DEVARAKONDA DIVISION NEWS

నల్గొండ జిల్లా దేవరకొండ డివిజన్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం రాష్ట్రంలోనే తొలిసారిగా ఓపెన్‌ ఎయిర్‌ జైలును ఇక్కడ నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాంతంలోని గిరిజనులు, చెంచుల జీవితాల్లో మార్పే లక్ష్యంగా అప్పటి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ జైలు నిర్మాణానికి చొరవ చూపారు. కాని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా.. పనులు ముందుకు సాగడం లేదు.

Will there ever be salvation for open air prison construction?
భూమి కేటాయించినా మొదలుకాని పనులు
author img

By

Published : Sep 8, 2021, 8:53 AM IST

Updated : Sep 8, 2021, 10:15 AM IST

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పూర్వీకుల ప్రాంతమైన నేరెడుగొమ్ము మండలం పెద్దమునిగల్‌లో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జైలు నిర్మాణానికి 289 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించగా.. భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) ద్వారా జైళ్ల శాఖకు భూమి బదిలీ కూడా చేశారు. ఇక్కడ నిర్మించనున్న జైలులో వ్యవసాయ పనులతో ఖైదీలకు స్వయం ఉపాధి కల్పించాలని సంకల్పించారు.

will-there-ever-be-salvation-for-open-air-prison-construction
నల్గొండ జిల్లా పెద్దమునిగల్‌ మండలంలో ప్రభుత్వం కేటాయించిన స్థలం

నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌ ప్రాంతానికి ఇది దగ్గరగా ఉండటంతో పెద్దఎత్తున వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసి, వనమూలికలు, పండ్లతోటలు, కూరగాయల పెంపకాన్ని చేపట్టాలని అప్పట్లో నిర్ణయించారు. ప్రభుత్వం సైతం రూ.50 కోట్లు మంజూరు చేసింది. అప్పటి జైళ్ల శాఖ డీజీ వీకేసింగ్‌తో పాటు జిల్లా, రాష్ట్ర అధికారులు పలుమార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించారు.

అప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి కదలిక లేకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రాథమిక పనులు పూర్తయ్యాయని త్వరలోనే పనులు మొదలవుతాయని జైళ్ల శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

RAINS IN TELANGANA: రాష్ట్రంపై వరుణాగ్రహం.. ఉత్తర తెలంగాణలో కుండపోత

Last Updated : Sep 8, 2021, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.