నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 569.10 అడుగులకు చేరింది. గత నెల రోజుల నుంచి పరిశీలిస్తే ఇప్పటివరకు ప్రాజెక్టులో 40అడుగుల మేర నీటిమట్టం పెరిగింది.
సాగర్ జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్ధ్యం 312.04 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 254.31 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జల విద్యుదుత్పత్తి ద్వారా 40,259 క్యూసెక్కుల వరద నీరు సాగర్ జలాశయానికి వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయం నుంచి ఎడమ కాలువ ద్వారా 4,107 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయంలో ఇంకా 20 అడుగుల మేరకు నీరు చేరితే సాగర్ జలాశయం నిండు కుండలా మారనుంది.
ఇవీ చూడండి: నిండుకుండలా ఎల్లంపల్లి ప్రాజెక్టు.. 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల