నాగార్జున సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 37 వేల 140 క్యూసెక్యూల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్ మొత్తం నీటి మట్టం 590 అడుగులకు గాను.. 535.10 అడుగులకు చేరుకుంది.
నాగార్జునసాగర్ జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 178.27 టీఎంసీల వద్ద ఉంది. శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే నీటి ప్రవాహానికి ఈనెలలోనే 5 అడుగుల మేరకు నీరు వచ్చి చేరింది.
గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి జులై మాసంలో కృష్ణా నదికి వరదలు కాస్తా ముందుగానే వచ్చాయి. 2019లో వచ్చిన వరదలకు సాగర్ జలాశయం నుంచి దాదాపు 400 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం ఆశాజనకంగా ఉండడంతో సాగర్ ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం వేచి చూస్తున్నారు. ఇలానే కృష్ణమ్మ పరుగులు పెడితే ఆగస్టు నెలలో జలాశయాలు పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉందని నీటిపారుదల శాఖఅధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?