![కారోబార్ను విధుల నుంచి తొలగించాలని వార్డు సభ్యుల ధర్నా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8180178_gp.jpg)
అవినీతికి పాల్పడిన గ్రామ పంచాయతీ కారోబార్పై క్రిమినల్ కేసు నమోదుచేయాలని డిమాండ్ చేస్తూ... నల్లగొండ జిల్లా శాలిగౌరారం వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అక్రమాలకు పాల్పడిన కారోబార్ బల్లెం యాదగిరిని విధుల నుంచి తొలగించి, క్రిమినల్ కేసు నమోదుచేయాలని గతంలో కలెక్టర్కు వార్డు సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జోగు సైదమ్మ, వార్డు సభ్యులు వడ్లకొండ పరమేష్, బట్ట లక్ష్మీనారాయణ, సురేష్, మంజుల, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: వైరల్ వీడియో: పీపీఈ కిట్లు ధరించి పెళ్లి భోజనం...