ETV Bharat / state

హుజూరాబాద్ ఫలితం మునుగోడులో రిపీట్ అవుతుందన్న కిషన్​రెడ్డి - rajagopal reddy on munugode by poll

kishan reddy on munugode by poll రాష్ట్రంలో ప్రజలు తెరాసను నమ్మే పరిస్థితి లేదని, మునుగోడు ఉప ఎన్నికలో భాజపా విజయం ఖాయమని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఫలితమే మునుగోడులోనూ రిపీట్ అవుతుందన్నారు. మరోవైపు ఆత్మ గౌరవానికి, అహంకారానికి యుద్ధం ఈ ఉప ఎన్నిక అని కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి వ్యాఖ్యానించారు. దిల్లీ నుంచి గల్లీ దాకా ప్రజలంతా మునుగోడు వైపే చూస్తున్నారన్నారు.

హుజూరాబాద్ ఫలితం మునుగోడులో రిపీట్ అవుతుందన్న కిషన్​రెడ్డి

author img

By

Published : Aug 20, 2022, 2:49 PM IST

Updated : Aug 20, 2022, 7:38 PM IST

హుజూరాబాద్ ఫలితం మునుగోడులో రిపీట్ అవుతుందన్న కిషన్​రెడ్డి

kishan reddy on munugode by poll: నైతిక విలువలతో కూడిన రాజకీయాల కోసం రాజగోపాల్​రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. అమిత్​ షా సమక్షంలో రాజగోపాల్​ రేపు భాజపాలో చేరతారని తెలిపారు. నల్గొండ జిల్లా మునుగోడులో రేపు జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడారు.

నైతిక విలువలతో కూడిన రాజకీయాల కోసం రాజగోపాల్​రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. గతంలో కర్ణాటక, మధ్యప్రదేశ్​లలోనూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి, తమ పదవికి రాజీనామా చేసి, పార్టీలో చేరారని గుర్తు చేశారు. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే తెరాసలో చేరారని విమర్శించారు. నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ భాజపా అని.. తెరాసలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. రాజగోపాల్​రెడ్డి ఇంకా పార్టీ మారక ముందే.. తెరాస ఇలా సభ నిర్వహించడం చూస్తుంటే ముఖ్యమంత్రికి భయం పట్టుకున్నట్టుందని ఎద్దేవా చేశారు.

రైతులను, గ్రామీణ ప్రాంతాల ప్రజలను మోసం చేయడం, మభ్య పెట్టడం తెరాసకు వెన్నతో పెట్టిన విద్య అని కిషన్​రెడ్డి విమర్శించారు. హుజూరాబాద్​ ఎన్నికల తర్వాత కేసీఆర్ కాళ్ల కింద భూమి కంపించినట్టయిందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలో ఆదరా బాదరాగా రోడ్లు, ఇతర నిర్మాణ పనులు చేపట్టారన్న ఆయన.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశాకే కేసీఆర్ మునుగోడుకు వస్తున్నాడన్నారు.

కేసీఆర్​కు రాష్ట్రంలో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలు, హైటెక్ సిటీ ప్రాంతం తప్ప ఇంకోటి కనిపించదని కిషన్​రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలోని ఎంపీలను, ఎమ్మెల్యేలను జీరోలుగా చేసి.. వారి కుటుంబసభ్యులను హీరోలుగా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరెన్ని చేసినా హుజూరాబాద్ ఫలితమే మునుగోడులో రిపీట్ కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

ప్రజలు తెరాసను నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుతున్నారు. రాజగోపాల్​రెడ్డి రేపు భాజపాలో చేరనున్నారు. మునుగోడు ఉపఎన్నికలో భాజపా విజయం సాధిస్తుంది. హుజూరాబాద్ ఫలితం మునుగోడులో రిపీట్ అవుతుంది. - కిషన్​రెడ్డి, కేంద్రమంత్రి

ఆత్మగౌరవానికి, అహంకారానికి యుద్ధం ఈ ఎన్నికలని మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. అహంకారంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అపాయింట్​మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుకు ఎలా వస్తాడని ప్రశ్నించారు. కేవలం రైతుబంధు, రైతు బీమా తప్ప ప్రజలకు వేరే చేసిందేం లేదని మండి పడ్డారు. దిల్లీ నుంచి గల్లీ దాకా ప్రజలంతా మునుగోడువైపే చూస్తున్నారన్నారు.

ఆత్మగౌరవానికి, అహంకారానికి యుద్ధం ఈ ఎన్నికలు. తప్పు చేసిన వ్యక్తి మళ్లీ ప్రజల ముందుకు వస్తారా. రైతుబంధు, రైతు బీమా తప్ప ప్రజలకు వేరే చేసిందేమీ లేదు. దిల్లీ నుంచి గల్లీ దాకా ప్రజలంతా మునుగోడు వైపే చూస్తున్నారు. - రాజగోపాల్‌రెడ్డి

ఇవీ చూడండి..

మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్​ కుట్ర చేస్తున్నారన్న బండి సంజయ్

మోయలేనంత రుసుం, చెల్లించకపోతే జులుం ఒత్తిడికి గురవుతున్న తల్లిదండ్రులు

భారత్​లో ఒక్కరోజే 13000 మందికి కరోనా, జపాన్​లో 2 లక్షల 60 వేలకుపైనే

Last Updated : Aug 20, 2022, 7:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.