Munugode by poll Evms: మునుగోడు బైపోల్ ఓటింగ్ అనంతరం ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సును కొందరు కారులో వెంబడించడం కాసేపు కలకలం రేపింది. ఈవీఎంలతో నల్గొండ వెళ్తున్న బస్సును కారులో కొందరు వెంబడించారు. అదేపనిగా తమ బస్సు వెంటే వస్తుండటంతో.. అనుమానించిన పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకునేందుకు కిందకు దిగారు.
పోలీసులను చూసిన వాహనంలోని ఐదుగురు వ్యక్తులు కారును అక్కడే వదిలి పారిపోయారు. పోలీసులు కారును జప్తు చేశారు. ఈవీఎంలను ఎత్తుకెళ్లేందుకే వారు కారులో వచ్చి ఉంటారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు మరింత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను నల్గొండ తరలించారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నారు.
ఇవీ చదవండి: