ETV Bharat / state

అకారణంగా రోడ్డెక్కితే వాహనాలు సీజ్ చేస్తాం : సీఐ - TWO WHEELERS SEIZED IN MIRYALAGUDA, NALGONDA DISTRICT

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో అకారణంగా రోడ్లపైకి వస్తున్నారని...అలా ఎవరు వచ్చిన వాహనాలు సీజ్ చేస్తామని రెండో ఠాణా పోలీసులు అన్నారు. ఆపై ఆయా వాహనాలు కోర్టు ద్వారానే తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

'అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు'
'అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు'
author img

By

Published : Apr 23, 2020, 1:40 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ యధేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న 200 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అధిక ధరలకు అమ్ముతున్న ఓ మెడికల్ షాప్, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఒక కిరాణా దుకాణానికి పోలీసులు తాళం వేశారు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకునేందుకు ఇచ్చిన గడువు తీరిన తర్వాత కూడా చిన్న కారణాలతో రోడ్లపైకి వస్తున్నారని టూ టౌన్ సీఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

బయట తిరిగితే కరోనా తప్పదు...

ఫలితంగా కరోనా ముప్పు పొంచి ఉండటమే కాక వారు దాని బారిన పడే అవకాశాలు ఎక్కువ అని సీఐ పేర్కొన్నారు. ఇతరులకు కూడా కొవిడ్-19 వ్యాధి సోకేలా చేస్తారన్నారు. సరైన కారణం లేకుండా ఎవరూ రోడ్లపైకి రావొద్దని ఆయన సూచించారు. తప్పని సరి పరిస్థితిలో కాకుండా అకారణంగా వాహనాలు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. లాక్ డౌన్ గడువు తర్వాత కోర్టు ద్వారా ఆయా వాహనాలు పొందే వీలు ఉంటుందన్నారు.

ఇవీ చూడండి : లంగర్​హౌస్​లో రోడ్డు ప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.