లాక్డౌన్ దృష్ట్యా నిత్యావసరాల కొరత వల్ల ఆకలితో అలమటిస్తున్న వ్యాధిగ్రస్థ చిన్నారులకు నల్గొండలోని ఇద్దరు వ్యాపారులు ఆపన్నహస్తం అందించారు. జిల్లా కేంద్రంలోని భాగ్యలత చిట్‌ఫండ్స్ యజమానులు శ్రీనివాస్, డీవీఎన్ రెడ్డి చిన్నారులకు కావాల్సిన సామాగ్రి వితరణకు ముందుకొచ్చారు.
స్థానిక డీఎస్సీ వెంకటేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా... చిన్నారుల ఆకలి తీర్చే సరుకులను అందజేశారు. బాలసదన్‌తోపాటు చారుమతి చైల్డ్ కేర్‌లోని పిల్లలకు సరకులు అందించి సేవాభావాన్ని చాటుకున్నారు. 60 మంది ఎయిడ్స్ వ్యాధి బాధిత చిన్నారులకు 60 వేల రూపాయల విలువైన వస్తువులు అందజేసి మనసున్న మారాజులుగా నిలిచారు.
ఇవీ చూడండి: సీరియస్‌గా తీసుకోకపోతే ముప్పు తప్పదు: మంత్రి కేటీఆర్