కార్మిక ఐకాస పిలుపు మేరకు ఈ రోజు ఆర్టీసీ కార్మికులు తల పెట్టిన ప్రజా ప్రతినిధుల ఇల్లు ముట్టడి కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య ఇంటిని ముట్టడించారు. దాదాపు 3 గంటలకు పైగా నోములు ఇంటి ముందు కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేంకగా నినాదాలు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మొండి వైఖరి వీడి ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ