నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో కారు పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. తెరాస అభ్యర్థుల గెలుపుతోనే మండలంలోని గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తాయని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు గెలుపుకు కారణమవుతాయని అన్నారు. తెరాస అధికారం చేపట్టిన తర్వాతే ముఖ్యమంత్రి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి గ్రామ అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధిగా భావించి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: 'కేసీఆర్తో చర్చలు అర్థవంతంగా జరిగాయి'