ETV Bharat / state

రైతు బంధు అన్నదాతల పాలిట ఓ వరం: పల్లా రాజేశ్వర్ రెడ్డి - త్రిపురారం మండలంలో ఉపఎన్నిక ప్రచారం

రైతుల పాలిట సీఎం కేసీఆర్ వరంలా మారారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా త్రిపురారంలో మండలంలో పర్యటించారు. నోముల భగత్​ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

trs mlc palla rajeshwar reddy election campaign గల
సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
author img

By

Published : Apr 2, 2021, 5:04 PM IST

రైతు బంధు పథకంతో అన్నదాతలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సంక్షేపథకాల అమలులో మనమే మొదటి స్థానంలో ఉన్నామని తెలిపారు. నాగార్జునసాగర్​ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని బడాయిగడ్డ, డొంక తండా, లోక్యా తండా, అప్పలమ్మగూడెం, బొర్రాయి పాలెం రాజేంద్రనగర్ పర్యటించారు.

ఉప ఎన్నికల్లో నోముల నర్సింహయ్య వారసుడు భగత్​ను మీ బిడ్డగా భావించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాడని పేర్కొన్నారు. తెరాస అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో ఎన్నికల మండల ఇంఛార్జ్​ ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా రైతు బంధు అధ్యక్షుడు రాంచందర్ నాయక్​, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పోచంపాడ్ ఘటనపై సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.