నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం గరికెనెట్ తండాలో తెరాస నుంచి కాంగ్రెస్లో చేరిన కార్యకర్తలకు మాజీ మంత్రి జానారెడ్డి.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏడేళ్లుగా సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని జానారెడ్డి విమర్శించారు. ఇక్కడ నివసించే గిరిజనులకు పట్టా, పాస్బుక్లు ఇవ్వకపోగా రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. ప్రతి గ్రామపంచాయతీలో రోడ్లు, వీధి దీపాలు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు. తెరాస ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి, పేదలకు రెండు పడక గదుల ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని ప్రభుత్వాన్ని నిలదీశారు.
నియోజకవర్గపరిధిలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధే తప్ప తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని వ్యాఖ్యానించారు. అనంతరం కొంపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు పార్టీ కార్యకర్తలను, ఇటీవల మృతి చెందిన వారి కుటుంబసభ్యులను జానారెడ్డి, పార్టీ నేతలు పరామర్శించారు.
ఇదీ చదవండి: అఖిలప్రియ అరెస్ట్.. కాసేపట్లో కోర్టులో హాజరు