మరికొన్ని రోజుల్లో జరగబోయే పురపాలక ఎన్నికలపై పీఓ, ఏపీఓ అధికారులకు ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని బాలికల ప్రభుత్వ కళాశాలలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల్లో వీరి బాధ్యత ఎక్కువగా ఉంటుందని పోలింగ్ జరిగే కేంద్రాల్లో ఎలా ఉండాలనే విషయాలపై శిక్షణ ఇచ్చారు. ఆర్డీఓ జగదీశ్వర్, మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పార్క్లో సందడి చేసిన ఎమ్మెల్యే