ఆటో, తుఫాను డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సీఐ పరశురాం సూచించారు. నల్గొండ జిల్లా కొండ మల్లెపల్లి, పీఏ పల్లి, గుర్రంపోడు పరిధిలోని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. పరిమితికి మించి ప్రయాణికులను వాహనాల్లో ఎక్కిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.
కొద్దిరోజులుగా ఎక్కువ మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న ఆటోలను సీజ్ చేసి.. క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. లాభాల కోసం ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. కేసు నమోదు చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా ఆర్టీఏ అధికారులకు సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 38 ఆటోలు, 2 ట్రాక్టర్లను సీజ్ చేసి 13 కేసులు నమోదు చేశామని సీఐ పరశురాం తెలిపారు.