కరోనా నివారణలో భాగంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు నిచ్చారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కూరగాయల ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమానికి సీఎల్పీ మాజీ నేత జానారెడ్డితో కలిసి హాజరయ్యారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం, నగదు చాలా మందికి అందలేదన్నారు. రేషన్ బియ్యం 20శాతం ప్రజలకు తినలేక పోతున్నారని, నాణ్యత పెంచి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డు లేని వారికి కూడా అందించాలని కోరారు.
వలస కూలీలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉత్తమ్ అన్నారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో సాయం అందట్లేదని, సహాయ చర్యలు వేగవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 కిలోల బియ్యంపై స్పష్టత లేదన్నారు. ఉజ్వల పథకంలో గ్యాస్, కిలో కందిపప్పు పేదవారికి ఉచితంగా ఇవ్వాలని చెప్పి నెలరోజులు గడుస్తున్నా ఆ ఊసే లేదని విమర్శించారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినట్టు టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేస్తేనే వ్యాధి కంట్రోల్ అవుతుందన్నారు. ఇండియన్ మెడికల్ రిసెర్చ్ ఆమోదించిన ప్రైవేట్ ల్యాబ్స్‌లో కూడా కరొనా టెస్టులు చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ... స్ట్రైక్లోవున్న సిబ్బందిని విధుల్లోకి తీసుకోకపోవడం ప్రజా వ్యతిరేక చర్య అని దుయ్యబట్టారు. ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో అలసత్వం వహిస్తుందన్నందునే... సిరిసిల్ల జిల్లాలో ధాన్యం తగలబెట్టారని విమర్శించారు.
ఇదీ చూడండి: భారత్‌లో కరోనా 2.0 ఖాయం- వచ్చేది అప్పుడే!