ETV Bharat / state

సందర్శనలో నగరం... 'క్యాష్' చేసుకోలేకపోతున్న ప్రభుత్వం - telangana latest news

కరోనాతో కుదేలైన పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వైరస్​ విజృంభణతో ఇంతకాలం ఇళ్లకే పరిమితమైన జనం.. ఇప్పుడే కాస్త బయటకు వస్తున్నారు. సొంత వాహనాలలో కుటుంబ సమేతంగా పర్యాటక ప్రదేశాలు, ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. ఇలాంటి వారిని ఆకర్షించడంలో పర్యాటకం, ఆర్టీసీ విఫలమవుతున్నాయి. కాలానుగుణంగా పర్యాటక స్వరూపం మార్చుకోకుండా.. ఎప్పుడూ నిర్వహించే యాత్రలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నాయి. ఫలితంగా మంచి రాబడి పొందే అవకాశం ఉన్నా.. చేజేతులా కోల్పోతున్నాయి.

పర్యాటకులను ఒడిసి పట్టుకోవడంలో వెనకబడిన పర్యాటకం, ఆర్టీసీ

author img

By

Published : Aug 2, 2021, 2:36 PM IST

కరోనా విజృంభణతో పర్యాటకం పడకేసింది. ఇప్పుడిప్పుడే క్రమంగా తేరుకుని అడుగులు వేస్తోంది. నగరానికి చేరువగా ఉన్న శ్రీశైలం గేట్లు గురువారం తెరిచారు. నగరం నుంచి భారీ ఎత్తున సొంత వాహనాల్లో వెళ్లి సందర్శించి వస్తున్నారు. ఆదివారం నాగార్జున సాగర్‌ గేట్లు కూడా తెరిచారు. సోమవారం బోనాల పండగ సెలవు ఉంది. ఈ వరుస సెలవులతో నగరవాసి అలా వెళ్లి.. ఇలా రావాలని కోరుకుంటున్నాడు. అలాంటి వారిని ఒడిసి పట్టుకోవడంలో తెలంగాణ పర్యాటకం, ఆర్టీసీ వెనుకబడింది.

శ్రీశైలం డ్యామ్‌ వద్ద కనువిందు చేస్తున్న కృష్ణమ్మ

అవకాశం అందిపుచ్చుకోక..

ఆర్టీసీ దగ్గర మినీ బస్సులున్నాయి. తెలంగాణ పర్యాటక శాఖతో గానీ.. పర్యాటకాభివృద్ధి సంస్థతో గానీ.. అనుసంధానమై యాత్రలు నిర్వహిస్తే ఉభయకుశలోపరిగా ఉంటుంది. అలాగే నాగార్జునసాగర్‌, శ్రీశైలం పర్యాటక ప్రాంతాలకు సురక్షితంగా వెళ్లి రావడానికి వీలుంటుంది. కానీ, ఆ దిశగా ఈ రెండు విభాగాలు ఆలోచించడం లేదు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులే కాదు.. నగరానికి చేరువలో చాలా జలపాతాలున్నాయి. బొగత జలపాతం, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో కుంటాల, పొచ్చర జలపాతాలను కూడా చూసి వచ్చేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేయాలి.

వర్షాకాలం ఆహ్లాదంగా ఉండే పర్యాటక ప్రాంతాలకు సురక్షితమైన పర్యాటకం ఏర్పాటు చేస్తే.. సందర్శకులు ముందుకు వస్తారు. కానీ, అలాంటి ఆలోచనే చేయడం లేదు. కాలానుగుణంగా పర్యాటక స్వరూపం మార్చుకోకుండా.. ఎప్పుడూ నిర్వహించే యాత్రలతోనే కాలం వెళ్లబుచ్చుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులతో జలకళ ఉట్టి పడుతున్నా.. ఆహ్లాదకర వాతావరణాన్ని అందిస్తున్నా.. ఆ భాగ్యాన్ని దర్శించుకునే అవకాశం లేకుండాపోతోంది.

22 గేట్లు తెరిచారు..

నాగార్జునసాగర్‌(Nagarjuna Sagar Dam) నుంచి సాగరం వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జునసాగర్‌ 22 గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో అనుకున్న సమయాని కన్నా ముందుగానే గేట్లు ఎత్తారు. శ్రీశైలానికి 4.41 లక్షల క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 4.35 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. ఇది రెండు రోజుల నుంచి కొనసాగుతోంది. సాగర్‌లోకి 3.72లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గానూ.. 587.20 అడుగుల మేర నీటి మట్టాన్ని తాకింది. నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలకు జలాశయంలో 305 టీఎంసీలను కొనసాగిస్తూ 22 క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు.

10 గేట్లు ఎత్తి నీటి విడుదల..

శ్రీశైలం జలాశయానికీ భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లలో.. 10 గేట్లను 15 అడుగులు ఎత్తి.. నీటి విడుదలను ఉన్నతాధికారులు కొనసాగిస్తున్నారు. డ్యామ్ ఇన్‌ఫ్లో 4,41,914 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 4,35,525 క్యూసెక్కులు ఉంది.

రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.80 అడుగులుగా ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 208.7210 టీఎంసీల వద్ద ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరుగుతోంది.

సంబంధిత కథనాలు..

Nagarjuna Sagar Dam: 22క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

SRISAILAM: శ్రీశైలానికి భారీగా వరద నీరు... 10 గేట్ల ఎత్తి నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.