ETV Bharat / state

రాష్ట్రంలో నిరంకుశత్వానికి న్యాయవాదుల హత్యలే నిదర్శనం: కోదండరాం - తెలంగాణ వార్తలు

తెలంగాణ ఉద్యమంలో మార్చి 10కి ప్రత్యేక స్థానం ఉందని.. మిలియన్ మార్చ్​కి ఈ ఏడాదికి పదేళ్లు పూర్తవుతుందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఆ రోజు అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించాలని కోరారు. పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.

tjs-kodandaram-fires-on-trs-government-at-miryalaguda-in-nalgonda-district
రాష్ట్రంలో నిరంకుశత్వానికి న్యాయవాదుల హత్యలే నిదర్శనం: కోదండరాం
author img

By

Published : Mar 7, 2021, 6:14 PM IST

తెలంగాణ ఉద్యమంలో మార్చి 10కి ప్రత్యేకమైన స్థానం ఉందని తెజస పార్టీ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మిలియన్ మార్చ్​ను ఆపడానికి 50 వేల మందిని అరెస్టు చేసినా... ట్యాంక్ బండ్ మీద లక్షలాది మంది పాల్గొని తెలంగాణ జెండాను ఎగురవేశారని గుర్తు చేశారు. ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన మిలియన్ మార్చ్ జరిగి ఆ రోజుకి పది ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించాలని కోరారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు.

ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించడం లేదని... ఉద్యమ చరిత్రను తుడిచిపెట్టి కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన చరిత్రనే ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన పెరిగిపోయిందని విమర్శించారు. న్యాయవాదులు వామనరావు, నాగమణి హత్యలు తెరాస దౌర్జన్యానికి నిదర్శనమని ఆరోపించారు.

డబ్బులు, ఇతరత్రా ప్రలోభాలకు లొంగకుండా పట్టభద్రులంతా ఈ ఎన్నికల్లో ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి తమని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి హెచ్చరిక పంపాలని... పట్టభద్రులు ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు.

ఇదీ చదవండి: 'ఆలోచించి మాట్లాడండి.. రాష్ట్రానికి భాజపా ఏం చేసింది?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.