ETV Bharat / state

నీళ్లు, నిధులు, నియామకాలను గాలికొదిలేశారు: కోదండరాం

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కోదండరాం నామినేషన్‌ దాఖలు చేశారు. నల్గొండ కలెక్టరేట్‌లో పత్రాలను సమర్పించారు. తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన నీళ్లు, నిధులు, నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు.

tjs chief kodandaram fires on state government
నీళ్లు, నిధులు, నియామకాలను గాలికొదిలేశారు: కోదండరాం
author img

By

Published : Feb 22, 2021, 7:22 PM IST

ప్రజల కోసం ఉద్యమాలు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం వారిని నిరంకుశంగా అణచివేస్తోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన నీళ్లు, నిధులు, నియామకాలు గాలికొదిలేశారని మండిపడ్డారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కోదండరాం నామినేషన్‌ వేశారు. నల్గొండ కలెక్టరేట్‌లో పత్రాలను సమర్పించారు.

భూ ఆక్రమణలు, ఇసుక దందాల చందంగా రాష్ట్రంలో రాజకీయాలు సాగుతున్నాయని కోదండరాం విమర్శించారు. వాటి మార్పునకే ఆరేళ్లుగా పోరాటం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తనను గెలిపించి.. మండలికి పంపించాలని అభ్యర్థించారు.

ఇదీ చూడండి: అక్కడ కరోనా కేసుల పెరుగుదల.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.